పొద్దున్నే,వెలుగుల
పూలబుట్టను నెత్తినెత్తుకొని
అడవి,
నగరంలోకి వచ్చింది..
మధ్యాహ్నానికి,
రంగురంగులు సింగారించుకొనీ
అడవి, మొక్కేటి
గౌరమ్మైంది..
సాయంత్రానికి,
చప్పట్ల జాతరలో,
పాటల పూజల్లో, అడవి
ఊరేగింపుల బతుకమ్మైంది,
రాత్రి, వీడ్కోలుల చీకటినద్దుకొని
చల్లని చెరువు గుండెల్లోకి
అడవి
మెల్లెగా ఒదిగిపోయింది…
ఆవృతమై
అడవి, అడవిలోకి చేరిపోయింది..!
పొద్దున- వెలుగు
మధ్యాహ్నం- సింగారం
సాయంత్రం- గౌరవం
రాత్రి- వీడ్కోలు,
ఇది బతుకమ్మకే కాదు
మనిషి జీవితానికి కూడా!
డాక్టర్ కాసర్ల
నరేష్ రావు
94414 06252