పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తారు. అయితే.. ఇలాంటి పెంపకం వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకు స్వేచ్ఛ, మార్గదర్శకత్వం అవసరమని చెబుతున్నారు. పెంపకం సరిగా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.