కొందరు మధ్యాహ్నం పూట ఓ పావు గంట – అర్ధగంట కునుకు తీస్తుంటారు. ఇంట్లో ఉన్నా.. ప్రయాణాల్లో అయినా.. కాసేపు నిద్రలో జోగుతుంటారు. ఇలాంటి పగటి నిద్ర మంచిదేనని నిపుణులు అంటున్నారు. మానసిక స్థితిని మెరుగుపరచడంతోపాటు ఆరోగ్యానికీ భరోసా ఇస్తుందని చెబుతున్నారు.
అయితే.. పగటిపూట ఎప్పుడుపడితే అప్పుడు నిద్ర పోవద్దు. ముందుగా.. నిద్ర కోసం సరైన సమయాన్ని కేటాయించుకోవాలి. దాన్ని ప్రతిరోజూ అనుసరించాలి. సమయం మారితే.. రాత్రి నిద్రపై ప్రభావం పడుతుంది.