HomeLifestylePumpkin Seeds Are Packed With Many Nutrients
అతిగా తింటే అనర్థమే!
గుమ్మడి విత్తనాలు.. అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో లభించే ప్రొటీన్, ఫైబర్,
మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. పరిమితికి మించితే మాత్రం.. ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపిస్తాయి.
గుమ్మడి విత్తనాలు.. అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో లభించే ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. పరిమితికి మించితే మాత్రం.. ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపిస్తాయి.
గుమ్మడి విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువైతే.. కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియా లాంటివి ఇబ్బంది పెడతాయి.
వీటిలో క్యాలరీలు ఎక్కువే! మోతాదుకు మించి తీసుకుంటే.. బరువు పెరుగుతారు.
కొందరిలో గుమ్మడి విత్తనాలు అలెర్జీని కలిగిస్తాయి. గొంతులో చికాకు, దగ్గుతోపాటు తలనొప్పికీ కారణం అవుతాయి. ఇంకొందరిలో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిస్తే.. గుమ్మడి విత్తనాలను తినకపోవడమే మంచిది.
లోబీపీ (హైపోటెన్షన్) ఉన్నవారు.. గుమ్మడి గింజలకు దూరం పాటించాలి. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు.. రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి, లోబీపీ వారికి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.
ఇక పిల్లలకు చాలా తక్కువగా అందివ్వాలి. లేకుంటే.. కడుపునొప్పి, విరేచనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, పిల్లలతోపాటు పెద్దలు కూడా.. గుమ్మడి గింజలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.