మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక శారీరక సమస్యలను దూరం చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటాయి. మునగాకులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, జింక్, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. అవన్నీ జుట్టు సమస్యలకు చక్కటిపరిష్కారం చూపుతాయి. మునగాకుతో హెయిర్ ప్యాక్స్ తయారుచేసుకొని వాడితే.. అద్భుత ఫలితాలు కనిపిస్తాయి.
ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ మునగాకు పొడి, టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకోవాలి. రెండిటినీ బాగా మిక్స్ చేసి.. కొద్దికొద్దిగా పెరుగు కలుపుతూ మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టేలా జుట్టుకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట సేపు అలాగే ఉంచి.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.