‘ఆనందంగా జీవించడమే.. అసలైన ఆస్తి’ అని పెద్దల మాట. సంపదలో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఆ కొండ కరిగితే కుంగిపోవడం మూర్ఖులు చేసే పని. అయితే, ఆ ఆనందం అనేది అద్దె వస్తువేమీ కాదు. మనసు పెడితే దాన్ని ఎవరికి వారే సృష్టించు కోవచ్చు. సొంత చర్యలతోనే మన జీవితాన్ని సంతోషమయం చేసుకోవచ్చు. అలాంటి ఆనందాన్ని అన్లాక్ చేయడానికి.. ఈ‘కీ’లకాలను గ్రహించండి.