లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు. త్వరగా ఎదిగేయాలని ఇబ్బడి ముబ్బడిగా ఎరువులు వాడేస్తుంటారు. అయితే, ఇలా మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే రసాయన మందులు వాడటం ఏమాత్రం మంచిదికాదు.
రసాయన ఎరువుల ప్రభావంతో నేల నాణ్యత తగ్గిపోతుంది. మితిమీరిన ఎరువుల వాడకం.. మొక్కలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా, సరైన పోషకాలు అందక మొక్కలు వాడిపోయి.. ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, అప్పుడే నాటిన మొక్కలకు తక్కువ గాఢత ఉండే ఎరువులు వేయాలి. పండ్లు, పూలు, కూరగాయలు ఇస్తున్న పెద్ద మొక్కలకు మాత్రమే ఇతర ఎరువులు అందించాలి.