నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. నలభై నాలుగు విధాల గ్రేటు. చిరునవ్వుల తొలకరి విరిసిన ప్రతిసారీ మనసు తేలికపడుతుంది. చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. నవ్వుతూ బతికితే ఆయుష్షు పెరుగుతుంది. అందుకే.. ఆరోగ్య సాధనలో నవ్వును మించిన ఔషధం లేదని పెద్దల మాట. మరి చిరునవ్వు ఎన్నేసి ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందామా? కాస్త నవ్వుతూ చదివేయండి..