ఫర్నిచర్‌కు శాకాహారం, మాంసాహారం అనే తేడా తెలియదు. వెజ్ బ్యాచ్‌కు ఎంత మెత్తగా ఆతిథ్యం ఇస్తాయో, నాన్‌వెజ్ ప్రియులకూ అంతే సాదరంగా స్వాగతం పలుకుతాయి. కాకపోతే.. ఇక్కడ ఫర్నిచర్ కూరగాయల ఆకృతిని ధరించిందంతే.
వంకాయవంటి కుర్చియు.. అని రాగయుక్తంగా పాడుకుంటూ బ్రింజాల్ సోఫాలో సేదతీరొచ్చు, కొబ్బరి చిప్పలో కునుకు తీయొచ్చు, వెల్లుల్లి చేసే మేలును తలుచుకోవచ్చు. అరటి ‘ఫన్’డు సాక్షిగా మేను వాల్చొచ్చు. ఆరెంజ్ సీటు.. గొప్ప రేంజ్లో ఉందని మురిసిపోవచ్చు.