మైక్రోవేవ్ ఓవెన్‌ను వారానికి ఒక్కసారైనా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే.. ఓవెన్ లోపలి భాగంలో బ్యాక్టీరియా పెరుగుతుందని అంటున్నారు. ఇక అందులో పడిపోయే ఆహార పదార్థపు అవశేషాలు కుళ్లిపోయి.. దుర్వాసన కూడా వస్తుంది.
లోపలి భాగమంతా జిడ్డుగా మారుతుంది. ఇలాంటప్పుడు ఓ గిన్నెలో వేడినీరు, కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మకాయ సగం ముక్క వేసి ఓవెన్లో ఉంచాలి. అధిక ఉష్ణోగ్రతను సెట్ చేసి ఐదు నిమిషాలపాటు వేడి చేయాలి. ఆ తర్వాత బౌల్‌ను బయటికి తీసి పొడి క్లాత్‌తో తుడిచేస్తే.. ఓవెన్ శుభ్రంగా మారిపోతుంది.