వేసవిలో కొట్టొచ్చినట్టు కనిపించే రంగులనే ఇష్టపడతారు చాలామంది. ఎండలో ఆ వర్ణాలు మరింత మెరుస్తాయనే నమ్మకం కావచ్చు. షర్ట్, టీషర్ట్, చుడీ, చీర.. ఏదైనా బ్రైట్ బ్రైట్‌గా ఉంటేనే.. రైట్ రైట్ చెప్పేస్తారు.
ఆ మిరుమిట్లకు ఆభరణాలు మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి? అందుకే ఓ జువెలరీ సంస్థ నియాన్ మెరుపులతో.. పద్దెనిమిది క్యారెట్ల రోజ్ గోల్డ్ ఎగ్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వీటిని పెండెంట్స్లా వేసుకోవచ్చు. ఐదు వర్ణాల్లో, రెండు పరిమాణాల్లో లభిస్తున్నాయివి. ఇంకాస్త రిచ్‌నెస్ కోరుకునే వారికి వజ్రాలను పొదిగి మరీ అందిస్తున్నారు. డిజైన్‌ను బట్టి ధర మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షలు. WWW.FABERGE.COMలో ఆర్డర్ చేసుకోవచ్చు.