వినియోగదారుల ప్రయోజనం కోసం రూపకల్పన
అందుబాటులో 10 రకాల సేవలు
టోల్ ఫ్రీ నంబర్ 1912కునేరుగా ఫిర్యాదు
ఇచ్చోడ, మే 15: కరెంట్ సమస్యల పరిష్కారానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత కొద్ది రోజులుగా క్రితం దీనిని మరింత మెరుగ్గా రూపొందించారు. వినయోగదారులు విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటు 10 రకాల సేవలు పొందేలా మార్పులు చేశారు. ఫిర్యాదులు, సలహాలు, సూచనలు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది.
కంప్లయింట్స్ ఆప్షన్ క్లిక్ చేసి..
కరెంట్ బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరాలో సమస్య, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, హై, లోవోల్టేజ్లతో సమస్య వచ్చినా యాప్‌లో కంప్లయిట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సర్వీస్ నంబర్, ఈ మెయిల్ ఐడీ నమోదు చేయాలి. అనంతరం ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యను టైప్ చేసి సబ్మిట్ కొట్టాలి. తర్వాత సెల్ ఫోన్‌కు ఫిర్యాదు నంబర్‌తో పాటు ప్రాంతం వాటి వివరాలు వస్తాయి.
డౌన్ లోడ్ ఇలా..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లోకి వెళ్లగానే రిపోర్టు అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే కెమెరా గుర్తు కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్లోకి కెమెరాకు అనుసంధానమవుతుంది. విద్యుత్ సమస్య ఉన్న ప్రాంతాన్ని ఫొటో తీయాలి. అనంతరం పేరు, ఫోన్ నంబర్, సమస్య నమోదు చేయాలి. ఇందులో జీపీఎస్ కో- ఆర్డినేట్ వ్యవస్థ ఉండడంతో ఏ ప్రాంతం నుంచి ఫొటో పంపించారో అధికారులకు తెలిసిపోతుంది. అనంతరం సబ్మిట్ చేయాలి. సమస్య సమాచారం నేరుగా విద్యుత్ సంస్థ ఏర్పాటు చేసిన సర్వర్లోకి వెళ్తుంది.
యాప్‌లో ఇవి ఉంటాయి
వినియోగదారులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు యాప్‌లో అవకాశం కల్పించారు. ఫిర్యాదు చేసిన తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదు సంఖ్యను కంప్లయింట్ ఐడీలో నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
చెల్లిస్తున్న బిల్లు వివరాలు తెలుసుకునే సౌకర్యం కూడా యాప్‌లో ఉంది. ఈ ఆప్షన్‌లోకి వెళ్లిన సర్వీస్ వివరాలు నమోదు చేయగానే బిల్లు చెల్లింపు వివరాలు చూపిస్తుంది.
సమస్య నేరుగా తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1912ను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.
యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. వినియోగదారుడి సర్వీస్ నంబర్ నమోదు చేయాలి.
కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ‘యాప్’లో అప్లయి ఫర్ న్యూఅపాయిమెంట్ కనెక్షన్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా కూడా చేయవచ్చు
‘యాప్’ ద్వారా చేసిన దరఖాస్తును ఉన్నతాధికారులు సంబంధిత కార్యాలయానికి పంపించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. పరిష్కారమయ్యాక వినియోగదారుడి ఫోన్‌కు మేసేజ్ వస్తుంది.