e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home కొమరంభీం కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌ డౌన్‌

కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌ డౌన్‌

కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌ డౌన్‌

బోథ్‌, ఏప్రిల్‌ 22: మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. గురువారం వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. కర్ఫ్యూలో భాగంగా సీఐ నైలు, ఎస్‌ఐ రాజు బోథ్‌తో పాటు సొనాల గ్రామాల్లో రాత్రి సమయంలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు.
నేరడిగొండ, ఏప్రిల్‌ 22: కరోనా కేసులు పెరుగుతుండడంతో మండల కేంద్రంలో వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు బంద్‌ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు తప్పా, మిగతావి మూసి ఉండడంతో వ్యాపార సముదాయాలు వెలవెలబోతున్నాయి.
ఉట్నూర్‌, ఏప్రిల్‌ 22: మండల కేంద్రంలో కరోనా విజృభిస్తుండడంతో పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు వ్యాపారులతో సమావేశం నిర్వహించి స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ మహేశ్‌ సూచించారు. తర్వాత దుకాణం తెరిచి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
బేల, ఏప్రిల్‌ 22: మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసు, రెవెన్యూ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలపై సర్పంచ్‌ ఇంద్రశేఖర్‌ అవగాహన కల్పిస్తున్నారు.
భీంపూర్‌, ఏప్రిల్‌ 22: భీంపూర్‌, కరంజి(టీ) గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. అనవసరంగా ఎవ్వరూ బయటకు రావద్దని సర్పంచ్‌లు జీ స్వాతిక, మడావి లింబాజీ సూచించారు.
ఇచ్చోడ, ఏప్రిల్‌ 22: సిరిచెల్మ గ్రామంలో రెండో రోజు గురువారం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించారు. ఉదయం నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి దుకాణాలను రెండు గంటల పాటు తెరిచి ఉంచడానికి అనుమతిచ్చారు. దుకాణాలు మూసివేయడంతో జన సంచారం లేక ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది.

Advertisement
కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌ డౌన్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement