e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కొమరంభీం పర్యాటక సొబగులు

పర్యాటక సొబగులు

పర్యాటక సొబగులు

గుండాల, మిట్టె జలపాతాల ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
రూ. కోటితో నివేదికలు
ఇప్పటికే అటవీశాఖ అనుమతులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూలై 19(నమస్తే తెలంగాణ):సహజసిద్ధ అందాలకు నెలవైన కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా లింగాపూర్‌ మండలం పిట్టగూడలోని మిట్టె, తిర్యాణి మండలం రోంపల్లి సమీపంలోని గుండాల జలపాతాలను పర్యాటకంగా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే అటవీశాఖ నుంచి అనుమతులు రాగా, రూ. కోటి అంచనాలతో నివేదికలు రూపొందిస్తున్నది. త్వరలో పనులు చేపట్టనుండగా, ఈ వాటర్‌ ఫాల్స్‌ మరింత శోభను సంతరించుకునే అవకాశమున్నది.

అడవుల జిల్లా ఆసిఫాబాద్‌లో ప్రకృతి అందాలకు కొదువలేదు. ప్రధానంగా లింగాపూర్‌ మండలంలోని మిట్టె, తిర్యాణి మండలం రోంపల్లి సమీపంలోని గుండాల జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. సుమారు రూ. కోటి అంచనాలతో ఈ జలపాతాలను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు నివేదికలు తయారు చేస్తున్నారు. అడవుల మధ్య ఉన్న ఈ జలపాతాల వద్దకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యంతో పాటు, పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు కావాల్సిన వసతులు కల్పించనున్నారు. జలపాతాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టనున్నారు.

- Advertisement -

అందాల గుండాల..
తిర్యాణి మండల కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుండాల జలపాతం. 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. కొండలపై నుంచి వచ్చే నీటి ప్రవాహంతో సహజ సిద్ధమైన లోయల్లోకి జాలువారుతున్న నీరు తెల్లని నురగలా కనువిందు చేస్తోంది. దట్టమైన అడవిలో ఉండడం వల్ల ప్రస్తుతం రోడ్డు వసతి లేదు. సుమారు 9 కిలో మీటర్లు నడిచి వెళ్లాలి. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనుండడంతో త్వరలోనే రవాణా వసతితో పాటు జలపాతం వద్ద పర్యాటకులకు వసతులు అందుబాటులోకి రానున్నాయి.

కట్టిపడేసే మిట్టె జలపాతం..
ఆసిఫాబాద్‌ జిల్లాకు అరుదైన గుర్తింపు తెచ్చినవి మిట్టె జలపాతాలు. వీటిని సప్తగుండాలు అనికూడా అంటారు. లింగాపూర్‌ మండలం పిట్టగూ డ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. సహజ సిద్ధంగా గుట్టలపైనుంచి సుమారు 80 అడుగుల నుంచి జాలువారుతుంది. ఇలా జాలువారే జలపాతాలు ఒక దాని తర్వాత ఒకటి.. ఇలా ఎమినిది ఉన్నాయని ఇక్కడి గిరిజనులు చెబుతున్నారు. ఈ జలపాతాల్లో రెండు మాత్రమే చూడగలిగే అవకాశం ఉంది. మిగతా జలపాతాలను అడవిలోకి వెళ్లి చూడడం సాధ్యం కాదని గిరిజనులు అంటుంటారు. సహజ సిద్ధమైన ఈ జలపాతాలను ఆదివాసులు తమ పవిత్ర పుణ్యక్షేత్రా లుగా ఆరాధిస్తారు. తాము పూజించే దేవుళ్లు ఈ స్థలాల్లో ఉంటారని వారి నమ్మకం. పంటలు వేసింది.. మొదలు.. దిగుబడి ఇంటికి వచ్చే వరకు ఈ జలపాతాల వద్ద పూజలు చేస్తుంటారు.

ఆనందంగా ఉంది..
రోజూ పారిశుధ్య సిబ్బంది చెత్త తీసేస్తుండడంతో గ్రామంలో ఎక్కడ చూసినా శుభ్రంగానే ఉంటుంది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. రైతువేది క, ప్రకృతివనం, నర్సరీలు, డంప్‌యార్డు ఏర్పాటు చేశాం. ప్రకృతివనంలోని పార్కును ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. కేసీఆర్‌ సర్కారు నిధులు సమకూర్చడంతోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగాం.

  • గొల్ల రవీందర్‌, సర్పంచ్‌, గుల్లకోట

ప్రజల సహకారంతోనే..
ప్రజల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వ్యక్తి గత, పరిసరాల శుభ్రతకు వారు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తూ ట్రాక్టర్‌ వచ్చినప్పుడు పారి శుధ్య సిబ్బందికి అందజేస్తు న్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇంటింటికీ మొక్కలు అందజేసి, నాటేలా ప్రోత్సహించాం.

  • సురేశ్‌, పంచాయతీ సెక్రటరీ, గుల్లకోట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పర్యాటక సొబగులు
పర్యాటక సొబగులు
పర్యాటక సొబగులు

ట్రెండింగ్‌

Advertisement