అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరికలు
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు.
ఎర్రుపాలెం, జనవరి 12: రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. గురువారం ఎర్రుపాలెంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకుల సన్నాహాక సమావేశంలో మండలంలోని చొప్పకట్లపాలెం, మామునూరు గ్రామాల నుంచి కాంగ్రెస్, టీడీపీకి చెందిన 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. వారికి వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యుత్, వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారనే విషయంపై చర్చ జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, మాజీఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకులు మొగిలి అప్పారావు, రామకోటేశ్వరరావు, కొండేపాటి సాంబశివరావు, శీలం ఉమామహేశ్వరి, మూల్పూరి శ్రీనివాసరావు, బాలరాఘవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరావు, సగ్గుర్తి కిశోర్, పురుషోత్తంరాజు, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
దేశంచూపు ఖమ్మం బీఆర్ఎస్ సభ వైపు : వర్ధన్నపేటఎమ్మెల్యే
చింతకాని, జనవరి 12: ఈ నెల 18న ఖమ్మంలో జరుగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వైపు యావత్‌దేశం చూస్తున్నదని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని నాగులవంచలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18న ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న సభకు నలుగురు గురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు హాజరవుతున్నారని, ప్రతిగ్రామం నుంచి భారీ జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్, బీఆర్ఎస్ నాయకులు, రైతుబంధుసమితి సభ్యులు, 26 గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

