కూసుమంచి (నేలకొండపల్లి), ఆగస్టు 4: ఎవరైతే ప్రజలతో కలిసి పనిచేస్తారో వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంపీటీసీలు, సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై తగిన విధంగా స్పందిస్తే ప్రజల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు చాలా బాగా పనిచేశారని గుర్తు చేశారు. అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయటం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఎంపీటీసీలు, జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మికి సన్మానం చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నంబూరి శాతం, నాయకులు పాల్గొన్నారు.