ఖమ్మం : వైరా పోలీస్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన స్నేహామెహ్రా ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం వైరా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఐపీఎస్ శిక్షణ అనంతరం గ్రేహౌండ్స్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె మార్చి 2వ తేదీన ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో రిపోర్టు చేశారు.
ఉత్తరాఖండ్ రాణీఖట్ పట్టణానికి చెందిన స్నేహా మెహ్రా సివిల్ సర్వీసెస్-2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తుండగా ఇటీవల వైరా ఏసీపీగా పని చేసిన సత్యనారాయణ బదిలీపై వెళ్లడంతో తాత్కాలికంగా ఆమెను ఏసీపీ నియమించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లాఎండ్ఆర్డర్ సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు.