వైరాటౌన్, జూన్ 27 : అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరుపేద మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఆధార్ కార్డులు చూపుతూ ఇండ్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, సుంకర సుధాకర్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది నిరుపేదలు ఇండ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వారి అర్హతలనుబట్టి వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఇందిరమ్మ కమిటీలు, రాజకీయ జోక్యం లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చింతనిప్పు చలపతి, సుంకర సుధాకర్, మచ్చా మణి తదితరులు పాల్గొన్నారు.