మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
- టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు
- గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
కొత్తగూడెం టౌన్, మార్చి 19 : ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు కుటుంబ, ఉద్యోగ వ్యవహారాల్లో సహకరించి.. వారి సమస్యలను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు ముందుకు సాగాలని కోరారు. జిల్లా అధికారుల్లో సగభాగం మహిళలు ఉండడం మంచి పరిణామమన్నారు.
జిల్లాలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారందరి సహకారంతో జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. పాలనాధికారిగా జిల్లాను ముందుకు నడిపించడం పట్ల కలెక్టర్ ప్రియాంక ఆలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాగా.. జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును టీజీవోస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, డాక్టర్ విజయ్కుమార్, వెంకటేశ్వర్లు, దస్రూ, అబ్రహం, తిరుపతి, కనకదుర్గ, దుర్గమ్మ, రుక్మిణీదేవి, విజేత, తిరుమలేశ్, శ్రీనివాస్, ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

