చండ్రుగొండ, జనవరి 24: అర్హులైన కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధిహామీ పథకం మహిళా కూలీలు చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులపాటు పనిచేసి ఉండాలనే నిబంధనలు తొలగించాలన్నారు.
అసలైన నిరుపేదల కూలీల కుటుంబాలను గుర్తించి వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు అందించే ప్రభుత్వ పథకాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధిహామీ కూలీలు బొల్లెపోగు వరలక్ష్మి, కాకటి హైమావతి, రెడ్డిపోతు సునీత, కాకటి ధనమ్మ, పోతురాజు పార్వతి, బొల్లెపోగు యశోద, చెంగల రాములమ్మ, రెడ్డిపోతు సునీత తదితరులు పాల్గొన్నారు.