వైరా టౌన్, సెప్టెంబర్ 8: పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలకూ తావులేదని తేల్చిచెప్పారు. అందరమూ కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేస్తామని అన్నారు. వైరాలోని వ్యవసాయ మార్కెట్ వద్ద మున్సిపాల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచి తాను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి గమనించి ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో తాను లేనప్పటికీ పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నానని అన్నారు. వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌లాల్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వడమే ధ్యేయంగా పనిచేద్దామని అన్నారు.
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వేల్పుల పావని, వాంకుడోతు శకుంతల, బానోతు సోని, నంబూరి కనకదుర్గ, పోట్ల కవిత, తోటకూర పిచ్చయ్య, మచ్చా నర్సింహారావు, కట్టా కృష్ణార్జున్‌రావు, బాణాల వెంకటేశ్వరరావు, పోట్ల శ్రీను, లకావత్ గిరిబాబు, వెల్లంకి సత్యనారాయణ, కిలారు మాధవరావు, శీలం వెంకట్రామిరెడ్డి, గాలి శ్రీనివాసరావు, మద్దెల రవి, సతీశ్‌కుమార్, సక్కుబాయి, వనమా విశ్వేశ్వరరావు, లాల్‌మహ్మద్, బానోతు సురేష్, పెద్దబోయిన ఉమాశంకర్, దారెల్లి కోటయ్య, మిట్టపల్లి సత్యంబాబు, పద్మావతి, దుగ్గినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.