మామిళ్లగూడెం, జూన్ 14: ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిషరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిషారంపై హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుం చి ఆయా జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించా రు. అనంతరం ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ సమాధానమిస్తూ.. జిల్లాలో అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్ల స్థాయిల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వచ్చే పక్షం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులన్నీ పరిషరిస్తామని అన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లాలో 3,500 దరఖాస్తులు పరిషరించామ ని, ఫిజికల్‌గా 5 వేల దరఖాస్తులు పరిషరించామని తెలిపారు. అధికారులు ఇటీవల ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇక నుంచి వీటిపై దృష్టి కేంద్రీకరించి పరిషరిస్తామని సమాధానమిచ్చారు.
ఒక్కో తహసీల్దార్ రోజుకు కనీసం 25 దరఖాస్తులను పరిషరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఈ దిశగా కార్యాచరణ చేసి పెండింగ్ దరఖాస్తుల పరిషారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఎల్ఏ కమిషనర్ వీసీ అనంతరం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో ధరణి దరఖాస్తులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను తిరసరించవద్దని సూచించారు. అనంతరం ధరణి మాడ్యూల్స్‌పై తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో 385 ధరణి దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. సీసీఎల్ఏ వీసీలో భద్రాద్రి ఐడీవోసీ నుంచి ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వల్ల దరఖాస్తుల విచారణ నిలిచిపోయిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 80 శాతం దరఖాస్తుల విచారణను పూర్తి చేశామని, ఇంకా 20 శాతం దరఖాస్తుల విచారణ మాత్రమే పెండింగ్‌లో ఉందని వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులపై కూడా వెంటనే విచారణ చేపట్టాలని, వారం రోజుల్లోగా పూర్తి నివేదికలు అందజేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవోలు మధు, దామోదర్‌రావు, డీఆర్వో రవీందర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.