Former Minister Puvvada | బీఆర్ఎస్ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం.. పోలీసులకు మాజీ మంత్రి పువ్వాడ హెచ్చరిక
Former Minister Puvvada | కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
జూలూరుపాడు : కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar ) స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో విధులు నిర్వహించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పోలీసులు హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
భవిష్యత్తులో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, తప్పుడు చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సరైన విధులు నిర్వహించి తగిన రీతిలో పనిచేయాలని పోలీసులకు హితవు పలికారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

