కారేపల్లి, నవంబర్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయనుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం సింగరేణి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వెంకిట్యాతండాలో మంగళం కంపెనీ ఎండిడీరాజేందర్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షల వ్యయంతో ఏఐ విద్యా బోధనకు అవసరైన సదుపాయాలను కల్పించగా దానిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వెంకిట్యాతండాలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రమైన కారేపల్లిలో సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 44 సీసీ రోడ్డులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైరా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలతో పాటు అనేక అభివఅద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, సింగరేణి సీఐ సాగర్, ఎస్ఐ గోపి, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు తలారి చంద్రప్రకాశ్, బానోత్ రామ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, బానోతు దేవ్లానాయక్, అడ్డగోడ ఐలయ్య, మేదరి టోనీ, గుగులోత్ భీముడు, బానోత్ హీరాలాల్, డేగల ఉపేందర్, ఎండీ.యాకూబ్ అలీ, గోపాల్ నాయక్, హేమలత, బాలాజీ పాల్గొన్నారు.