బోనకల్లు, ఏప్రిల్ 15 : ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం బోనకల్లు మండలంలోని రాయన్నపేట గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో అధికారులు, నాయకులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రేషన్ కార్డులో సభ్యుల ఆధారంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు పైడిపల్లి కిశోర్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు తాసీల్దార్ అనిశెట్టి పున్నమి చందర్, ఎంపీడీఓ రమాదేవి, మధిర సీఐ మధు, మార్కెట్ కమిటీ సభ్యులు అనుమోలు వెంకటేశ్, వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కరివేద సుధాకర్, శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మండలాధ్యక్షుడు గాలి దుర్గారావు, మహిళా సంఘం అధ్యక్షురాలు చేబ్రోలు రమాదేవి, గంగసాని రాఘవరావు,ఆర్ఐ మైథిలి, ఎస్ఐ మధుబాబు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.