ఎర్రుపాలెం, మే 13 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఐకేపీ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన GO 363/2025 అలాగే జీఓ 302/2022 ప్రకారం అమలు చేయాల్సిన పలు అంశాలు ఇంకా అమలులోకి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వీఓఏలకు తగిన వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
వీఓఏల ప్రధాన డిమాండ్లలో నెలకు రూ.20 వేల వేతనం అమలు, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు, అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోట్ చేయడం, రూ.20 లక్షల భీమా సౌకర్యం కల్పించడం, ట్యాబ్ సౌకర్యం ఇవ్వడం, జీఓ 58ను సవరించడం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. అనంతరం జేఏసీ తరఫున సమ్మె నోటీసుకు సంబంధించిన లేఖను ఎర్రుపాలెం ఎస్ఐ రమేశ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏ కమిటీ సభ్యులు కోట హేమలత, పి.కనకదుర్గ, ఏ.ఏడుకొండలు, వేమిరెడ్డి సుజాత, రజిత, జరీనా, ప్రశాంతి, వరలక్ష్మి, లావణ్య, కమల, సరోజిని పాల్గొన్నారు