భద్రాచలం, డిసెంబర్ 25: భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ఆదివారం భద్రాద్రి రామయ్య వరాహావతారంలో భక్తులను అనుగ్రహించారు. ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభువుని, బ్రహ్మదుల మొర విన్న శ్రీమన్నారాయణుడు.. నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి ‘వరాహావతారాన్ని’ ధరించాడాని ప్రతీతి. ఈ అవతారంలో నారాయణుడు భూమిని తన కోరలతో పైకెత్తుతాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంఠకుడైన హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూమిని రక్షిస్తాడు. రాహుగ్రహ బాధలున్నవారు ఈ వరాహావతారంలో ఉన్న రామయ్యను దర్శిస్తే ఆ బాధల నుంచి విముక్తులవుతారని పురాణాల్లో ఉంది.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగిం పు, సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం, నిత్య పూజలు జరిపారు. అనంతరం ధనుర్మాసోత్సవాల్లో భా గంగా శ్రీకృష్ణ పరమాత్మను, ఆండాళ్ అమ్మవారిని, స్వామివారి ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొని వ చ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి 30 ద్రవిడ పాశురాలను విన్నవించారు. అనంతరం శాత్తుమొరై, గోష్టి తదితర కార్యక్రమాలను జరిపారు. తరువాత యాగవీరమూర్తులకు వరాహావతారాన్ని అలంకరించారు. మధ్యాహ్నం అంతరాలయంలోని మూలవరులకు మాధ్యాహ్నిక ఆరాధన జరిపి వరాహావతారంలో ఉన్న రామయ్యను ప్రత్యేక పల్లకిలో మే ళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నౄత్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య బేడా మండపానికి తీసుకొకొచ్చా రు. ప్రత్యేక వేదికపై భక్తుల దర్శనార్థం ఉంచారు. వరాహావతారంలో ఉన్న రామయ్యను భక్తులు దర్శించుకొని తన్మయత్వం చెందారు. తరువాత స్వామివారిని రాజవీధిలోని విశ్రాంత మండపానికి తీసుకొని రాగా అక్కడ ఉన్న భక్తులు భక్తి పారవశ్యంతో రామయ్యను దర్శించుకున్నారు. అక్కడ నుంచి స్వామివారిని తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవకు తీసుకెళ్లారు.
నేడు నృసింహావతారం
భద్రాద్రి దేవస్థానంలో 4వ రోజు శ్రీసీతారామచంద్రస్వామివారు నృసింహావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నా రు. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడిని అనేక బాధలకు గురి చేస్తున్న హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఆ శ్రీహరి ఈ నృసింహావతారాన్ని ధరించాడని ప్రతీతి.
పర్ణశాల ఆలయంలో..
పర్నశాల, డిసెంబర్ 25: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్ష్యేత్రమైన పర్ణశాల రామాలయంలోనూ శ్రీసీతారామచంద్రస్వామి వారు ఆదివారం వరాహతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆలయంలోనూ ముక్కోటి అధ్యయనోత్సలు మూడో రోజు ఆదివారం వైభవంగా కొనసాగాయి.