భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడారు. వచ్చే ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.