ఖమ్మం, మార్చి 7: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మహిళలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు మాజీ సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషిచేశారని గుర్తుచేశారు. వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారని వివరించారు. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రూ.20 లక్షలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి 1,00,116 రూపాయలను అందించారని తెలిపారు.
ఖమ్మం, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహిళలకు శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి రంగంలో వారు తమ ప్రతిభను చాటుకుంటూ ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దకిందన్నారు.