ఖమ్మం, మే 4: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెకలతోపాటుగా కులగణనను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో యశోదా ఆస్పత్రి యాజమాన్యం ఆదివారం ఏర్పాటుచేసిన కాపు ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిపిన సర్వేలో బాగా తప్పులు జరిగాయని అన్నారు. మున్నూరుకాపు, ఇతర బీసీ కులాల జనాభాను 50 లక్షల వరకు తకువ చేసి చూపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్ రవీందర్రావు.. ఎంపీ వద్దిరాజును శాలువాతో సతరించి జ్ఞాపికను బహుకరించారు.