ఖమ్మం, జూన్ 1: రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక పర్వదినమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వారు వేర్వేరు ప్రకటనల్లో జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అవతరణ దినోత్సవమంటే కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకునే రోజని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకునే రోజని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఉద్యమ సంకల్పాన్ని నిలబెట్టే స్ఫూర్తిదాయక రోజుగా ప్రతి ఒక్కరూ దీనిని జరుపుకుందామంటూ ఉమ్మడి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.