ఖమ్మం సిటీ, జూలై 9: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించినందుకు కృతజ్ఞతగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గురువారం పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందుగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం కేసీఆర్‌కు వద్దిరాజును సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వద్దిరాజు నియామకంపై రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తాను రాసిన లేఖను ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కేసీఆర్ అందించారు.