చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో గత కొద్ది రోజులుగా వ్యాక్సినేషన్ కేంద్రాలను నిర్వహిస్తూ అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నామని అన్నారు. వ్యాక్సినేషన్ అందిస్తున్న వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు.
వైద్యులు మహమ్మారి సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వ్యాక్సిన్ కేంద్రాల్లో పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజికదూరం పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ గీత, వైద్య సిబ్బంది ఇమామ్, శ్రీనివాస్,పద్మ, శాంతి, తదితరులు పాల్గొన్నారు.