కారేపల్లి, నవంబర్ 27 : విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందని టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి బానోత్ రాందాస్ అన్నారు. గురువారం కారేపల్లి మండలం మాణిక్యారంలో జరిగిన యూటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వరంగ విద్యతోనే సామాజిక అసమానతలు తొలిగిపోతాయన్నారు. ప్రభుత్వ విద్యా రక్షణకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ కమిటీ నివేదికను బహిరంగ పరిచి అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలనే నిర్ణయం సహేతుకం కాదన్నారు. దీనిపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 30వ తేదిన యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్రృత స్ధాయి సమావేశాలు కల్లూరులో జరగనున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుత్తా ఫణికుమార్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ కృష్ణారావు, బానోత్ మంగీలాల్, ఉపాధ్యక్షులు బానోత్ సూర్య, ఆర్.నాగలక్ష్మి, కోశాధికారి ఎటుకూరి నాగేశ్వరరావు, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ మద్దినేని నాగేశ్వరరావు, కార్యదర్శులు సంతులాల్, ఈర్య, రామారావు, నరేంద్ర, భాస్కర్‌రావు పాల్గొన్నారు.