కారేపల్లి, ఆగస్టు 25 : సింగరేణి మండల కేంద్రంలో గల పీఏసీఎస్ (యూరియా బస్తాల నిల్వ గోడౌన్)ను ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దనసరి పుల్లయ్య సోమవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా మండలంలో యూరియా నిల్వల గురించి మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, సొసైటీ సీఈఓ బొల్లు హనుమంతరావుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నానో యూరియా వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో అవసరానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కారేపల్లి గోడౌన్లో 10 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నదని, మంగళవారం మరో 10 మెట్రిక్ టన్నుల యూరియా బస్తాలు రానున్నట్లు వెల్లడించారు. రైతులకు సరిపడా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
Karepalli : రైతులకు సరపడా యూరియా సరఫరా చేయాలి : ఏడీఏ పుల్లయ్య