కారేపల్లి, జూలై 26 : పంటలకు యూరియా కొరత రైతులను వేధిస్తుందని, దానిని వెంటనే తీర్చాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకంబరం, వజ్జా రామారావు అన్నారు. శనివారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు పడికాపులు కాస్తున్నారన్నారు. కారేపల్లి మండలంలో యూరియాను కారేపల్లిలో ఉన్న సోసైటీ, రైతు ఆగ్రోస్ ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. అరకొరగా స్టాక్ వస్తుండటంతో దూర ప్రాంతాలైన రేలకాయలపల్లి, చీమలపాడు, కమలాపురం, మాదారం రైతులు మండల కేంద్రానికి వచ్చేలోపే యూరియా నిల్వలు అయిపోతున్నాయన్నారు.
దీంతో రైతులు ఏమి చేయాలో తెలియని పరిస్ధితి వచ్చిందన్నారు. ప్రభుత్వం యూరియా అమ్మకం కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు. యూరియాను అందుబాటులో ఉంచి రైతులకు అవసరానికి తగిన విధంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాసిన్నినాగేశ్వర్రావు, అన్నారపు కృష్ణ, ముక్కా సీతారాములు, పండగ కొండయ్య, కరపటి సీతారాములు, ఎరిపోతు భద్రయ్య, వల్లభినేని మురళి పాల్గొన్నారు.