ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలోని సాయిరాంతండా, జూలూరుపాడు, వినోభానగర్, బూర్గపంహాడ్ మండలాల వ్యాప్తంగా రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. కాకర్ల, అనంతారం, గుండెపుడిలోని మిర్చి కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిచి ముద్దయింది. కాకర్ల – పడమటి నర్సాపురం నర్సాపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలవాలడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరకగూడెం మండలంలోని రేగుళ్ల గ్రామంలో ఇళ్ల పైకప్పులు వేసిన రేకులు ఎగిరి కిందపడ్డాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కొత్తకారాయగూడెం, పాతకారాయిగూడెం, అడవిమల్లెల, కోండ్రుపాడు, గణేశ్పాడు, ఎల్.ఎస్.బంజర, ముత్తగూడెం, కుప్పెనగుండ్ల, బోనకల్లు మండలంలోని చిరునోముల, చొప్పకట్లపాలెం, ముష్టికుంట్ల మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగూడెంలోని ఓ చెట్టుపై పిడుగుపడింది.
– నమస్తే నెట్వర్క్