రాజీవ్ యువ వికాసం సీమ్‌లో సిబిల్ సోర్ కీలకం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు క్రెడిట్ సోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించారు. సిబిల్ సోర్ తకువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరసరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోన్ అప్లికేషన్‌కు ముందు సిబిల్ సోర్ను బ్యాంకులు తప్పనిసరిగా పరిశీలిస్తున్నాయి.
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దానికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్లికేషన్‌కి రూ.200 వరకు వసూలు చేస్తున్న బ్యాంకులు ఉన్నట్లు సమాచారం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హుల జాబితాపై బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల ప్రకారం.. దరఖాస్తుదారుల సిబిల్ సోర్, గతంలో తీసుకున్న రుణాల వివరాలను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా గత ఐదేళ్లలో కార్పొరేషన్ రుణాలు తీసుకున్నారా? అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఐదేళ్లు పూర్తయితేనే వారు కొత్త రుణం పొందడానికి అర్హులు.
-ఖమ్మం, మే 27
మాజీ ప్రధాని, శాస్త్ర సాంకేతికరంగాన్ని ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ.. అంత గొప్ప వ్యక్తి పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కి కేవలం ప్రకటనకే పరిమితమైంది. రోజుకొక నిబంధనతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రేవంత్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో గత నెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఆ తరువాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. అర్హుల జాబితాను బ్యాంకర్లకు అందజేశారు. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఐతే ఇప్పటికే గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఫైనల్ చేయడంలో కాంగ్రెస్‌కు చెందిన ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరించాయి.
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేసేలా వ్యవహరించారు. దీని ప్రభావంతో యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న అనేక మంది నిరుద్యోగులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది కాంగ్రెస్ నేతలు రుణం ఇప్పిస్తామని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు అర్హత ప్రామాణికంగా రుణాలు మంజూ రు చేయాలని దరఖాస్తుదారులు కోరుకుంటున్నారు.
బ్యాంక్ లింకేజీ తప్పనిసరి..
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ యువ వికాసం సీమ్. ఈ పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీపై రుణాలు అందిస్తున్నది. ఈ రుణాలు వివిధ వ్యాపారాలు, వృత్తుల కోసం ఇవ్వనున్నారు. తద్వారా యువత ఆర్థికంగా స్థిరపడటానికి సహాయపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
రాయితీపోను మిగతా వాటా భరించేందుకు లబ్ధిదారు సిద్ధంగా ఉన్నా యూనిట్లు మంజూరు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం అమల్లో పారదర్శకత పెంచేందుకు, నిధులు పకదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ జిల్లా సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత అర్హుల జాబితాను బ్యాంకర్లకు పంపించి, ఆ యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేయాలని సూచనలు చేసింది.
కేటగిరీల వారీగా దరఖాస్తుల స్వీకరణ ఇలా..
జిల్లావ్యాప్తంగా ఈ పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల నుంచి మొత్తం 95,325 దరఖాస్తులు వచ్చాయి. రాయితీ రుణాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఎస్సీ విభాగంలో 29,742, బీసీ విభాగంలో 39,616, ఈబీసీ విభాగంలో 2,704, ఎంబీసీ విభాగంలో 1,228, మైనార్టీ విభాగంలో 7,412, క్రిస్టియన్ మైనార్టీ విభాగంలో 117 మొత్తం 95,325 దరఖాస్తులు వచ్చాయి. రాయితీ రుణాల మంజూరులో ఉన్న కొన్ని నిబంధనలు దరఖాస్తుదారులను కలవరపరుస్తున్నాయి. గ్రామంలో ఒకే రకమైన యూనిట్‌కు ఒకరికి మాత్రమే అర్హత ఉండటంతో ఎవరికి అవకాశం వస్తుందోననే సందిగ్ధత నెలకొంది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు నూరుశాతం రాయితీ కల్పించగా.. బ్యాంకు లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరీ-2, 3, 4లలో యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా, లబ్ధిదారు వాటా కింద బ్యాంకు రుణం తీసుకోవాలి. కేటగిరీ-2 కింద యూనిట్ వ్యయం రూ.లక్షలో 10 శాతం, కేటగిరీ-3 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 20 శాతం, కేటగిరీ-4 కింద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 30 శాతం చొప్పున బ్యాంకు లింకేజీ తప్పనిసరి. రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీన అర్హులైన వారికి మంజూరు పత్రాలు అందజేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.