కూసుమంచి, డిసెంబర్ 24 : రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎంతకష్టమైనా అమలుచేసి తీరుతామని, రాష్ట్ర ప్రజలకు రెండు, మూడ్రోజుల్లో మరో రెండు తీపి కబుర్లును అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలం పాలేరులో శనివారం జరిగిన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేదవాడి చెంతకు పరిపాలన అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో తనతోపాటు ఉన్న ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని స్పష్టంచేశారు. ప్రజల అభిమానానికి రుణపడి ఉంటామని జిల్లాలో ముగ్గురు మంత్రులు అందరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తరువాత అంతా మనవాళ్లేనన్నారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, పేదవాడి కలను సాకారం చేయడానికి శక్తివంచన లేకుండా పని చేస్తామన్నారు.
పాలేరు నియోజకవర్గంలోని 2వేల మందికి క్రిస్మస్ దుస్తులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ఫాదర్లు, సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 145మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, విద్యుత్ బాధితులకు రూ.7 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, తంబూరి దయాకర్‌రెడ్డి, న్యాయవాది నిరంజన్‌రెడ్డి, సుడిగాలి కిషన్‌రావు, రామసహాయం అరవింద్‌రెడ్డి, ఎంపీపీలు శ్రీను, మంగీలాల్, రమ్య, జడ్పీటీసీ బెల్లం శ్రీను, తహసీల్దార్ సంపత్‌కుమార్, నాయకులు శివరామకృష్ణ, మల్లారెడ్డి, రవికుమార్, గోపాల్‌రావు, వెంకటరెడ్డి, వాసు, సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి, అశోక్, భద్రయ్య, ఈఈ వెంకటేశ్వర్లు, ఏడీఏ విజయ్‌చంద్ర, ఏడీఈ కోక్యానాయక్, నాలుగు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏవోలు పాలేరు సర్పంచ్ మంగమ్మ, సీఐలు జితేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, ఎస్సై రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.