ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టిఆర్ఎస్ కార్యాలయ ఇన్‌ఛార్జి ఆర్జేసి కృష్ణలు పిలుపినిచ్చారు. గురువారం టీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన నగర కమిటీ, అనుబంధ కమిటీల తొలి సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి అజయ్ ఖమ్మం ప్రజల గుండె చప్పుడు అన్నారు. ఖమ్మం నగర కమిటీ రాజకీయాలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుందని , నూతన కార్యకర్తలు, పార్టీ నియమ, నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికలలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని వారు ఉద్ఘాటించారు.
నగర అధ్యక్షులు పగడాల నాగరాజు మాట్లాడుతూ నగరంలో పార్టీని బలోపేతం చేయడంలో సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. మంత్రి పువ్వాడ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రంలోనే ఖమ్మానికి ప్రత్యేక గుర్తింపు తీసుకరావడంలో సైనికుడిలా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ మాజీ అధ్యక్షులు కమర్తపు మురళి, మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్, నాయకులు జక్కుల లక్ష్మయ్య ఇషాక్, పొన్నం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ అధ్యక్షులు మేకల సుగుణరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తొగరు భాస్కర్, యువజన అధ్యక్షులు దేవభక్తిని కిషోర్‌బాబు, సురేష్, తన్నీరు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.