మధిర : టీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని సిరిపురం భక్తాంజనేయస్వామి ఆలయానికి రూ.40 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, విద్యార్థులకు గురుకుల పాఠశాలల ఏర్పాటు చేశారని, అదేవిధంగా వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు పెన్షన్ను పెంచి వారిని అన్ని విధాలా ఆదుకున్నారన్నారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ చావా వేణు, కోన నరేందర్రెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణనాయక్, తదితరులు పాల్గొన్నారు.