కారేపల్లి, జూన్ 04 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, దివంగత బానోత్ మదన్‌లాల్ సంస్మరణ సభను బీఆర్ఎస్ సింగరేణి మండలం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో జరిగిన ఈ సంతాప సభకు పలు పార్టీల నాయకులు హాజరై మదన్‌లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గిరిజన బంజారా జాతిలో పుట్టిన మదన్‌లాల్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పరితపించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించినట్లు చెప్పారు. ఆయన మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు వాంకుడోత్ జగన్, ఉన్నం వీరేందర్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, రైతు బంధు మాజీ కన్వీనర్ హనుమకొండ రమేశ్, మాజీ ఎంపీటీసీలు జడల వసంత, పెద్దబోయిన ఉమాశంకర్, మాజీ సర్పంచులు ఇస్రావత్ బన్సీలాల్, బానోత్ కుమార్, భూక్య రమణ, గూగులోత్ సక్రూనాయక్, ఉద్యమ నాయకులు జడల వెంకటేశ్వర్లు, భూక్య చందునాయక్, బీఆర్ఎస్ నాయకులు షేక్ గౌసుద్దీన్, గంగారబోయిన సత్యం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాశ్, సీపీఎం మండల కార్యదర్శి కుందనపల్లి నరేంద్ర, సీపీఐ ఎంఎల్ (న్యూడేమోక్రసీ)మండల కార్యదర్శి వై.ప్రకాశ్, తేజ నాయక్, అంబేద్కర్ సంఘం నాయకుడు అదెర్ల రాములు, విశ్రాంత ఉద్యోగి బానోత్ రాములు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Karepalli : జన హృదయ నేత మదన్‌లాల్‌కు ఘన నివాళి
Karepalli : జన హృదయ నేత మదన్‌లాల్‌కు ఘన నివాళి