అశ్వారావుపేట రూరల్, జూలై 4 : పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ తమ భూములకు సంబంధించి గతంలో హైకోర్టు, కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల జాయింట్ సర్వే నిర్వహించి భూముల లెక్కలు తేల్చాలని కోరారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.