కారేపల్లి, సెప్టెంబర్ 18 : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యాబోధన చేస్తున్నట్లు డీడీ టీ డబ్ల్యూ ఎన్ విజయలక్ష్మి, ఏసీఎంఓ ఎల్.రాములు తెలిపారు. ఏఐ తో విద్యా భోధనలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యా బోధనలో గిరిజన సంక్షేమ శాఖ నూతన ఒరవడిని తీసుకు వస్తుందన్నారు. సులువైన బోధనకు ఏఐ వినియోగం ఆవశ్యకతను వివరించారు.
ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు ఏఐ వినియోగంపై పట్టు సాధించి తరగతి గదిలో అమలు పరచాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఏఐపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం పూర్తయినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్లు జే.గోపి, ఎస్.రమేశ్, బి.బాల శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు బి.ధర్మా, జి.నాగరాజు, టి.వెంకటరమణ, ఉపాధ్యాయులు ఎం.బావు సింగ్, బి.రాందాస్, బానుచందర్, రవి, సోమ్లా, రాములు పాల్గొన్నారు.