కారేపల్లి, జులై 03 : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కార్యకర్తలకు ఈ నెల 5, 6 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు సైద్ధాంతిక అవగాహన, ప్రపంచ, దేశ రాజకీయ పరిస్ధితులు తెలిపేందుకు గాంధీనగర్లో రెండు రోజుల పాటు వివిధ అంశాలపై తరగతులు బోధించటం జరుగుతుందన్నారు. రాజకీయ, సైద్దాంతిక అవగాహన ఉండటం వల్ల బూర్జువ పార్టీలు అవలంభిస్తున్న విధానాలను ఎత్తిచూపవచ్చన్నారు. ఈ తరగతులను కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.