అశ్వాపురం, జనవరి 11: బీజేపీ ముఖ్య నాయకులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మొండికుంట గ్రామవాసి, బీజేపీ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు శివారపు డాక్టర్ బాబు, శివారపు రవీంద్రాచారి, సోమ అంజిరెడ్డి బుధవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కోడి అమరేందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి : రేగా
యువత క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కుమ్రం భీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. తొలుత కుమ్రం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, నాయకులు వెన్న అశోక్‌కుమార్, మర్రి మల్లారెడ్డి, జాలె రామకృష్ణారెడ్డి, కొల్లు మల్లారెడ్డి, కందుల కృష్ణార్జునరావు, గజ్జల లక్ష్మారెడ్డి, సర్పంచ్ పాయం భద్రయ్య, గద్దల రామకృష్ణ, మేడవరపు సుధీర్, దాసరి దాసు, గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.