విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ప్రజలకు సేవలు అందించాలి : ఖమ్మం సీపీ
సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్‌దత్ ఆకాంక్షించారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 20: సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్‌దత్ ఆకాంక్షించారు. ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ఆయన కానిస్టేబుళ్లకు పోలీస్ ఐడెంటిఫికేషన్ కార్డుతో పాటు కిట్స్ అందించి మాట్లాడారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీ, పీటీసీ వరంగల్, సీటీసీ సైబరాబాద్‌తో పాటు ఇతర సెంటర్లలో తొమ్మిది నెలల పాటు చక్కటి శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హోం సిక్కు గురికావొద్దని, మానసికంగా బలంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తోటి వారితో పంచుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. క్రమశిక్షణను అలవరచుకోవాలని, వ్యాయామం చేస్తూ దేహ దారుఢ్యాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ గణేష్, ఏవో అక్తరున్నీసా బేగం, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, అప్పలనాయుడు, సీఐలు అంజలి, స్వామి, వెంకన్న, సెక్షన్ సూపరింటెండెంట్ జానకీరాం పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

