బోనకల్లు, సెప్టెంబర్ 20 : అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను స్థానిక ఎస్ఐ పొదిలి వెంకన్న శనివారం పట్టుకున్నారు. బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో గల ఎర్రమట్టి గుట్టలను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న 3 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ శాఖకు పంపించి రెండు టిప్పర్లపై ఈ-చలాన్లు విధించినట్లు ఎస్ఐ తెలిపారు. మట్టి అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.