పెనుబల్లి, నవంబర్ 16 : సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దానని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మరోసారి తనకు అవకాశమిస్తే రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుతానని అన్నారు. పెనుబల్లి మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. అడవిమల్లెల, సూరయ్యబంజరతండా, కొండ్రుపాడు, పాతకారాయిగూడెం, కొత్తకారాయిగూడెం, వీఎం బంజర, గణేశునిపాడు గామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు తనకు ఎంతో ఆప్తులని, వారి కష్టసుఖాల్లో అన్ని వేళలా తాను పాల్పంచుకుంటున్నానని అన్నారు. అదే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించానని అన్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనించి ఈ ఎన్నికల్లో తనను ఆదరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారంతా ఎన్నెన్నో పదవులు అనుభవించినప్పటికీ ఇక్కడి అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్‌రావు, సోమరాజు రామప్ప, చెక్కిలాల లక్ష్మణరావు, మందడపు అశోక్‌కుమార్, తడికమల్ల సీత, బెల్లంకొండ హైమావతి, చీకటి చిట్టెమ్మ, దొడ్డపునేని శ్రీదేవి, లక్కినేని వినీల్, తాళ్లూరి శేఖర్‌రావు, చలపతిరావు, శేఖర్, వెంకటేశ్వరరావు, గామయ్య, చింతనిప్పు సత్యనారాయణ, కొత్తగుండ్ల అప్పారావు, చీకటి మోహన్‌రావు, దొడ్డపునేని రవి, కోమటి అలేఖ్య, ప్రసాద్, గువ్వల వెంకటరెడ్డి, నర్వోత్తమరెడ్డి, భూక్యా ప్రసాద్, లగడపాటి శ్రీను, గోదా చెన్నారావు, కొప్పుల గోవిందరావు, తడికమల్ల పాపారావు, గాదె రాజు తదితరులు పాల్గొన్నారు.