కారేపల్లి, డిసెంబర్ 03 : మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బుధవారం ఉదయం నుండి మొదలైంది. 41 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా సింగరేణి, భాగ్యనగర్ తండా, సీతారాంపురం, కోమట్ల గూడెం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని పలు సలహాలు, సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, ఎస్ఐ గోపి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.